ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వలస కార్మికురాలి కుమారుడికి సోనూ పేరు

cinema |  Suryaa Desk  | Published : Sat, May 30, 2020, 12:19 PM



ఎందరికో సహాయపడుతూ.. రియల్ లైఫ్ లో హీరో అనిపించుకుంటున్నారు నటుడు సోనూసూద్. కరోనా క్లిష్ట కాలంలో సొంత ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకి అండగా నిలిచిన సోనూ సూద్‌కి జనాలు అభినందనలు తెలుపుతున్నారు.

అనుపమ చోప్రాతో తాజాగా జరిగిన చాట్‌లో సోనూ సూద్ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు. తాను సహాయం చేసిన ఓ వలస కార్మికురాలు తన కుమారుడికి సోనూ సూద్ పేరును పెట్టుకుందట. నాకు పుట్టిన కుమారుడికి మీ పేరు పెట్టాను సర్ అంటూ ఓ మహిళ నాకు ఫోన్ చేసి చెప్పింది. వారి ఇంటి పేరును చివరకు చేర్చి సోనూ సూద్ శ్రీవాస్తవ అని పెట్టినట్లు ఆమె తెలిపింది. అది నన్ను చాలా కదిలించింది అని సోనూ సూద్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com