పలు తెలుగు సినిమాలు చేసి సరైన సక్సెస్ అందుకోలేకపోయిన తాప్సి బాలీవుడ్ మీద దృష్టి పెట్టి అక్కడ విజయవంతమైంది. హిందీలో మంచి పాత్రలు చేసుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఒక్కోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రోలింగ్‌కు కూడా గురవుతోంది. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోలింగ్ గురించి తాజాగా తాప్సీ స్పందించింది.నన్ను ఎవరైనా ట్రోల్ చేస్తే నేను దానికి బాధపడను. ఎందుకంటే ట్రోలింగ్ అంటే నాకిష్టం. దానిని ఆస్వాదిస్తా. మనలో మేటర్ ఉంటేనే కదా అందరూ మన దృష్టి పెడతారు. అప్పుడే మనం చేసే ప్రతి పనినీ విమర్శిస్తారు. కాబట్టి అది ఎంజాయ్ చేయాల్సిన విషయమేనని తాప్సీ చెప్పుకొచ్చింది.