ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువ కథానాయకుడికి అవకాశం ఇస్తున్న దర్శకేంద్రుడు

cinema |  Suryaa Desk  | Published : Sat, May 30, 2020, 04:48 PM



తెలుగు సినిమాకు కమర్షియల్ సొబగులు అద్దిన దర్శకుడు. తెలుగు మూవీని అందమైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్దిన ఘనుడు. ఆయన స్టైల్ డిఫరెంట్.. ఆప్రోచ్ డిఫరెంట్ .. మేకింగ్లో  వెరైటీ. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో ఆయన రూటే సెపరేటు. ఇక హీరోయిన్ ను గ్లామరస్ గా చూపించడంలో కే.రాఘవేంద్రరావు తర్వాతే ఎవరైనా...కమర్షియల్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్. భక్తి చిత్రాలను తీసి ప్రేక్షకులను పరవశింపజేసాడు.  రాఘవేంద్రరావు గత కొంతకాలంగా చిత్ర నిర్మాణానికి దూరంగా వున్నారు.ముగ్గురు కథానాయికలు, ముగ్గురు దర్శకులతో తాను ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ఆయన గతేడాది ప్రకటించారు. అయితే, ఆ తర్వాత దాని గురించి మళ్లీ అప్ డేట్ ఏమీ లేదు. దాంతో ఈ చిత్రాన్ని ఆయన డ్రాప్ చేసుకుని ఉంటారని అంతా భావించారు.అయితే, ఈ చిత్రాన్ని త్వరలో పట్టాలెక్కించనున్నట్టు ఆయన తాజాగా ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా గురించిన వివరాలు చెబుతానన్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని యంగ్ హీరో నాగశౌర్య దక్కించుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇదే వాస్తవమైతే కనుక, నాగశౌర్య కెరీర్ ఊపందుకుంటుందని చెప్పచ్చు!    






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com