ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాస్ బీట్ సాంగ్ ‘మైండ్ బ్లాక్’ కి అదిరిపోయే స్టెప్స్ వేసిన వార్నర్

cinema |  Suryaa Desk  | Published : Sat, May 30, 2020, 04:56 PM



తెలుగు సినిమా పాటలకు భార్యతో కలిసి స్టెప్పులేస్తూ టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోన్న ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈ రోజు మరోసారి డ్యాన్సుతో ముందుకొచ్చారు.  నిన్న తన నుండి వరుస వీడియోలు ఉంటాయని చెప్పిన వార్నర్ తన భార్య కాండీస్ వార్నర్ తో కలిసి సరిలేరు నీకెవ్వరు మూవీలోని మాస్ బీట్ సాంగ్ ‘మైండ్ బ్లాక్’ కి అదిరిపోయే స్టెప్స్ తో ఇరగదీశాడు. ఈ సాంగ్ లో మహేష్ డాన్స్ ని ఇమిటేట్ చేయడానికి వార్నర్ చాలా కష్టపడ్డాడట. దదాపు 50సార్లు ప్రయత్నిస్తే కానీ ఆ మాత్రం పర్ఫెక్షన్ రాలేదట. ఈ విషయాన్ని వీడియోతో పాటు వార్నర్ పంచుకున్నారు. ఇది జస్ట్ పార్ట్ వన్ అని చెవుతున్న వార్నర్ రేపు మరో ఆసక్తికర వీడియోతో వచ్చే అవకాశం కలదు. రేపు కూడా ఆయన మహేష్ కి సంబంధించిన సాంగ్ లేదా డైలాగ్ వీడియో చేయనున్నారు. తమ హీరో పాటకు ఇంటర్నేషనల్ క్రికెటర్ డాన్స్ చేయడం మహేష్ ఫ్యాన్స్ కి పిచ్చ కిక్ ఇస్తుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com