ప్రభాస్ సినిమా లో బాలీవుడ్ హీరోయిన్...

  Written by : Suryaa Desk Updated: Sun, May 31, 2020, 11:18 AM

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన.. మహానటితో పాపులరైన నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో సోషియో ఫాంటసీ జానర్‌లో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి సంబందించి అధికారిక ప్రకటన ఆ మధ్య విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. . ప్రస్తుతం హీరోయిన్ ను ఎంపిక చేసే పనిలో నాగ్ అశ్విన్ ఉన్నాడు. తొలుత ఈ సినిమాలో హీరోయిన్ గా అలియా భట్ నటిస్తుందనే ప్రచారం జరిగింది. తాజాగా దీపికా పదుకునే పేరు తెరపైకి వచ్చింది. దీనికి దీపిక తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన కామెంటే కారణం.'మహానటి' సినిమాను అందరూ చూడండి అని దీపిక కామెంట్ పెట్టింది. దీనికి కొనసాగింపుగా... తెల్లవారుజామున కూల్ నోటిఫికేషన్ అందుకున్నాను అంటూ నాగ్ అశ్విన్ తన సోషల్ మీడియా పేజ్ లో రాశాడు. దీంతో, ప్రభాస్ తో దీపిక జతకట్టబోతోందనే ప్రచారం ఊపందుకుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Recent Post