మహేశ్ బాబు 27వ సినిమా టైటిల్ 'సర్కారు వారి పాట'

  Written by : Suryaa Desk Updated: Sun, May 31, 2020, 11:55 AM

'గీత గోవిందం' సినిమాతో సూపర్ హిట్ ను సాధించిన పీ పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు 27వ సినిమా ఖరారైంది. ఇందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ఈ ఉదయం 9.09 నిమిషాలకు విడుదల కాగా, అది క్షణాల్లోనే వైరల్ అయింది. 'సర్కారు వారి పాట' టైటిల్ యునీక్ గా, సూపర్బ్ గా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ప్రకటనతోనే మహేశ్ బాబు సినీ కెరీర్ లో మరో హిట్ పడిపోయిందని అంటున్నారు.


'మరో హ్యాట్రిక్ కోసం బ్లాక్ బస్టర్ మొదలు' అంటూ ఈ పోస్టర్ పై మహేశ్ బాబు కామెంట్ పెట్టారు. ఇక ఫ్యాన్స్ అయితే, 'మాసివ్ మేకోవర్ లోడింగ్... ఒక్కొక్కడికీ గజం దింపుదాం అన్నా' అని, 'ఇక థియేటర్లలో పొర్లు దండాలే' అని కామెంట్లు పెడుతున్నారు. మహేశ్ పెట్టిన ట్వీట్ ఇప్పటికే దాదాపు 20 వేల రీట్వీట్లను, 6 వేల కామెంట్లను, 52 వేల లైక్ లను సాధించి దూసుకెళుతోంది.
Recent Post