సూప‌ర్ స్టార్ కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన సుధీర్ బాబు..

  Written by : Suryaa Desk Updated: Sun, May 31, 2020, 12:30 PM

ఈ రోజు సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేసుస్తున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో సుధీర్ బాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కృష్ణ అభిమానులను అలరించేలా ఆయన అల్లూరి సీతారామ‌రాజు సినిమాలోని డైలాగులను చెప్పాడు.


ఓ వైపు ఆ సినిమాలోని కృష్ణ నటించిన సీన్‌ను, మరోవైపు కృష్ణ చెప్పిన డైలాగులను అచ్చం అలాగే చెబుతూ సుధీర్‌ బాబు ఈ వీడియోను ట్వీట్ చేశాడు. ఆ వీడియో ఘట్టమనేని అభిమానులను ఆకర్షిస్తోంది. అల్లూరి సీతారామ రాజు సినిమాలో బ్రిటిష్ సైనికులు అల్లూరిని తపాకులతో కాల్చుతున్నప్పుడు 'ఒక్క సీతారామ రాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు పుట్టుకొస్తారు..' అంటూ ఈ డైలాగులు ఉంటాయి.Recent Post