ఓటిటి లో కీర్తి సినిమాలు..?

  Written by : Suryaa Desk Updated: Sun, May 31, 2020, 01:35 PM

కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నటి. ఆ సినిమాతో ఈ భామకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. తెలుగులో కీర్తి ప్రస్తుతం నితిన్‌కు జోడిగా 'రంగ్‌దే'లో నటిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్‌తో సినిమా  షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. అంతేకాకుండా థియేటర్స్ కూడా మూత పడ్డాయి. ఈ లాక్ డౌన్ ఎప్పటివరకు కొనసాగుతుందో తెలియని పరిస్థితి.


ఒకవేళా లాక్ డౌన్ తొలగించిన కూడా జనాలు సినిమా థియేటర్స్‌కు వచ్చి సినిమా చూసే పరిస్థితి ఎంతవరకు ఉంటుందో తెలియదు. అయితే ఓ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోతే తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సీ వస్తుంది. దీంతో ఈ నష్టాల నుంచి.. ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలా అని ఫిలిం మేకర్స్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. 


అందులో భాగంగా తెలుగులో ప్రస్తుతం చాలా సినిమాలు ఓటీటీలోకి వచ్చే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య నాని నటించిన వి, రామ్ హీరోగా వస్తోన్న రెడ్ సినిమాలు ఓటీటీలో విడుదలకానున్నాయని టాక్ నడిచింది. 


అందాలతార కీర్తి సురేష్ నటించిన 'పెంగ్విన్' అనే తమిళ చిత్రం కూడా డిజిటల్ మీడియా ద్వారా విడుదల కానుంది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కార్తీక్ సుబ్బరాజు నిర్మించిన ఈ చిత్రాన్ని లాక్ డౌన్ కారణంగా థియేటర్లలో కాకుండా, అమెజాన్ ప్రైమ్ ద్వారా వచ్చే నెల 19న విడుదల చేయనున్నారు.


ఈ సినిమా తెలుగులో కూడా అదే పేరుతో స్ట్రీమ్ కానుంది. ఇక్కడ మరో విశేషమేమంటే ఆమె నటించిన మరో తెలుగు చిత్రం 'మిస్ ఇండియా' నిర్మాత కూడా డిజిటల్ రిలీజ్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. నూతన దర్శకుడు నరేంద్రనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ కోనేరు నిర్మించాడు. 


ఇక ఈసినిమా మాత్రమే కాదు కీర్తి నటిస్తున్న మిగతా రెండు లేడి ఓరియెంటెడ్ సినిమాలు కూడా డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలకానున్నాయట. ఈరెండు కూడా స్ట్రయిట్ తెలుగు సినిమాలే. మహానటి తరువాత కీర్తి, తెలుగులో మిస్ వరల్డ్, గుడ్ లక్ సఖి సినిమాలకు సైన్ చేసింది 


అందులో మిస్ వరల్డ్ ఏప్రిల్ లో విడుదలకావాల్సి వుంది కానీ కరోనా వల్ల వాయిదా పడింది అయితే మంచి డీల్ కుదిరితే డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేయడానికి నిర్మాత రెడీ గా వున్నాడట. నూతన దర్శకుడు నరేంద్ర నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ ఎస్ కోనేరు మహేష్ కోనేరు నిర్మిస్తున్నాడు.


ప్రముఖ డైరెక్టర్ నగేష్ కుకునూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుడ్ లక్ సఖి కూడా డైరెక్ట్ గా ఓటిటి లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి, ఆది పినిశెట్టి, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 
Recent Post