కృష్ణ పుట్టినరోజు సందర్భంగా 'జుంబారే..జుజుంబ‌రే' పాట ప్రొమోను విడుదల

  Written by : Suryaa Desk Updated: Sun, May 31, 2020, 01:45 PM

'జుంబారే..జుజుంబ‌రే' పాటకు మ‌హేశ్ బాబు మేనల్లుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గ‌ల్లా అశోక్ డ్యాన్స్ చేశాడు. ఈ రోజు కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ పాట ప్రొమోను విడుదల చేశారు. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌కత్వంలో ఓ సినిమాలో ఆయన నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అచ్చం కృష్టలా అశోక్ డ్యాన్స్ చేసి ప్రేక్షకులను అలరించనున్నాడు.  


ఎస్వీ కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన య‌మ‌లీల సినిమాలో 'జుంబారే' పాటకు ప్రత్యేకంగా కృష్ణ డ్యాన్సుతో అలరిస్తారు. ఈ పాటను బాలసుబ్రహ్మణ్యం పాడగా, సాహిత్యం జొన్న‌విత్తుల అందించారు. ఆ పాట‌లో కృష్ణ సరసన  పూజా డ్యాన్స్ చేస్తుంది. కాగా,  అశోక్ గల్లా నటిస్తోన్న కొత్త సినిమాలో జ‌గ‌ప‌తి బాబు, న‌రేశ్‌, స‌త్యా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు చిత్రీకరణ ఇప్పటికే 50 శాతం పూర్తయింది.
Recent Post