మహేష్ ఫ్యాన్స్ వేడుకలకు సిద్ధం కావడమే: డైరెక్టర్ పూరి

  Written by : Suryaa Desk Updated: Sun, May 31, 2020, 05:53 PM

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ - మహేష్ కాంబినేషన్ లో పోకిరి, బిసినెస్ మాన్ అనే చిత్రాలు రాగా మంచి విజయాన్ని అందుకున్నాయి. సర్కారు వారి పాట మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విశేష ఆదరణ దక్కించుకుంటుంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ అలాగే 14 రీల్స్ కలిసి నిర్మించనున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్నాడు.  పూరి జగన్నాధ్ సర్కారు వారి పాట మూవీ టైటిల్ మరియు మహేష్ లుక్ పై స్పందన తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా పూరి సర్కారు వారి పాట టైటిల్ మరియు ఫస్ట్ లుక్ అధ్బుతం అన్నారు. అలాగే దర్శకుడు పరుశురాం ప్రయాణాన్ని ఎప్పటి నుండో గమనిస్తున్నాను అన్న పూరి ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావాలని కాంక్షించారు. ఇక మహేష్ ఫ్యాన్స్ వేడుకలకు సిద్ధం కావడమే అని ఆయన తెలియజేయడం విశేషం.
Recent Post