వలస కార్మికులకు ఇస్మార్ట్ పోరి సాయం...

  Written by : Suryaa Desk Updated: Sun, May 31, 2020, 06:00 PM

ఇస్మార్ట్ శంకర్ మూవీతో హీరోయిన్ గా నటించిన నిధి మంచి హిట్ అందుకుంది. ప్రస్తుతం తెలుగులో యంగ్ హీరో గల్లా అశోక్ సరసన నటిస్తుంది. మహేష్ మేనల్లుడు అయిన గల్లా అశోక్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా, ఆ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ని తీసుకున్నారు. కరోనా వైరస్ దేశంలో ఎంతటి దుర్భర పరిస్థితులు ఏర్పడేలా చేసిందో మనకు తెలిసిందే. దీనివలన కార్మికులు మరియు వలస కూలీలు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వీరిని ఆదుకొనే క్రమంలో అనేక మంది చిత్ర ప్రముఖులు ముందుకు వస్తున్నారు. కాగా యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ వలస కూలీలకు అవసరమైన ఆహారాన్ని సిద్ధం చేశారు. ఆమె వారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బ్రెడ్ దానం చేయనున్నారు. ఆ విధంగా ఈ కఠిన పరిస్థితులలో తనకు తోచిన సాయం చేస్తుంది నిధి.




Recent Post