సాహసానికి మారుపేరు కృష్ణ అంటున్న మెగాస్టార్

  Written by : Suryaa Desk Updated: Sun, May 31, 2020, 06:02 PM

నేడు సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి.. కృష్ణతో దిగిన ఫోటోని షేర్ చేస్తూ విషెస్ అందించారు. కథానాయకుడిగా 345 సినిమాలు దర్శకుడిగా 14 చిత్రాలు..నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయభాషల్లో 50 చిత్రాలు.. మొదటి సినిమాస్కోప్ సినిమా ఆయనదే.. మొదటి 70mm చిత్రం కూడా ఆయనదే. అనితరసాధ్యం ఈ ట్రాక్ రికార్డ్‌. సాహసానికి మారుపేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదినశుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.
Recent Post