200 మిలియన్ మార్క్ దాటిన 'బుట్టబొమ్మ'

  Written by : Suryaa Desk Updated: Sun, May 31, 2020, 06:04 PM

అల వైకుంఠపురము సినిమా లోని సాంగ్స్ ఏ రేంజ్ లో శ్రోతలను ఆకట్టుకున్నాయో వేరే చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమాలోని పాటలు మారుమ్రోగిమోతున్నాయి. ఇక ఈ సినిమా లోని బుట్టబొమ్మ సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఎందరో ఈ సాంగ్ ను ఎన్నో రకాలుగా టిక్ టాక్ చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ దిశ పాటని కూడా ఈ సాంగ్ గురుంచి, అల్లు అర్జున్ స్టెప్పులు గురించి మాట్లాడగా... తాజాగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ వార్నర్ కూడా ఈ సాంగ్ కు స్టెప్పులు వేశారు. అలాంటి బుట్టబొమ్మ సాంగ్ యూట్యూబ్ లో 200 ల మిలియన్ మార్క్ ను దాటేసింది.
Recent Post