ఇటీవలె సోషల్ మీడియా వేదికగా రానా తన ప్రేమ విషయం బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 21న రానా, మిహికా బజాజ్‌ల రోకా వేడుక పూర్తి కాగా, మరి కొద్ది రోజులలో నిశ్చితార్ధం జరుగనుంది. ఆ తర్వాత ఆగస్ట్‌లో వీరి పెళ్లి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తుంది. రానా తండ్రి సురేష్ బాబు పెళ్లికి సంబందించిన అన్ని ఏర్పాట్లని చకా చకా చేస్తున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లోనే పెళ్లి జరుపనున్నారని.. అది కూడా కొద్ది మంది బంధువులు, సన్నిహితలు సమక్షంలో వీరి వివాహం జరగనున్నట్టు తెలుస్తోంది. రానా, మిహీకా బజాజ్‌లు ఆగష్టు 8న పెళ్లి బంధంతో ఏకం కానున్నారని సమాచారం.