సూపర్‌స్టార్ మహేశ్ 27వ చిత్రం ‘సర్కారు వారి పాట’. సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ టైటిల్ లోగోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఎప్పుడెప్పుడా అని అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహేశ్ 27 సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇంకేముంది, సోషల్ మీడియాలో ఎంబీ ఫ్యాన్స్ కోలాహలం మిన్నంటింది.ఇక అసలు విషయానికొస్తే.... ఆదివారం ఉదయం 9 గంటల 9 నిమిషాలకు రిలీజైన 'సర్కారు వారి పాట' టైటిల్ పోస్టర్ టాలీవుడ్ రికార్డు సృష్టించింది. 24 గంటల వ్యవధిలో అత్యధిక రీట్వీట్లు పొందిన పోస్టర్ గా రికార్డు పుటల్లో స్థానం సంపాదించింది. ఎంతో డిఫరెంట్ గా కనిపిస్తున్న ఈ పోస్టర్ కు దాదాపు 33 వేల రీట్వీట్లు వచ్చాయి. తెలుగు చిత్రసీమలో మరే చిత్రం ప్రీలుక్ పోస్టర్ కు సోషల్ మీడియాలో ఈ స్థాయి స్పందన రాలేదు. ఇక, లైకుల విషయంలోనూ మహేశ్ బాబు కొత్త చిత్రం పోస్టర్ మోత మోగిస్తోంది. ఇప్పటివరకు 85 వేలకు పైగా లైకులు వచ్చాయి.