'ఏమాయ చేశావే' సినిమాతో కుర్రకారుని తనదైన మాయలో పడేసింది సమంత. ఆ సినిమా నుండి వెనుకకు తిరిగిచూడలేదు ఈ ముద్దుగుమ్మ. తెలుగులో ఆమెతో నటించిన మొదటి హీరో నాగ చైతన్యనే పెళ్లిచేసుకుంది సమంత. ప్రస్తుతం ఆమె తెలుగులో టాప్ హీరోయిన్లో ఒకరు. సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా వుంటుంది. తనకు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అకౌంట్లలో ఎపుడు యాక్టివ్‌గా ఉంటుంది. తెలుగులో ఏ హీరోయిన్‌కు ఇంకా చెప్పాలంటే.. టాప్ హీరోలకు కూడా లేనంత ఫాలోయింగ్ ట్విట్టర్లో సమంతకు ఉంది. అది అలా ఉంటే సమంత యాక్టింగ్‌లోనే కాదు చదువులో టాప్‌లో అదరగొట్టింది. దానికి సంబందించిన మార్క్ షీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఓ అభిమాని సమంత డిగ్రీ సర్టిఫికేట్‌ను సోషల్ మీడియాలో అకౌంట్లో షేర్ చేసాడు. ఇది మిగతా ఫ్యాన్స్ తో పాటు సమంత కూడా షాక్‌కు గురైంది. ఈ సర్టిఫికేట్ నీకు ఎలా వచ్చిందని ప్రశ్నించింది. సమంత ప్రశ్నకు రిప్లై ఇవ్వని సదరు నెటిజన్.. ఆ పోస్ట్‌ను డిలీట్ చేసాడు. కానీ సమంత డిగ్రీ సర్టిఫికేట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.