ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందుకే పాత్రల ఎంపికలో జాగ్రత్తపడుతున్నా:కీర్తి సురేష్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 02, 2020, 12:02 PM



కెరీర్ ఆరంభం నుంచి సాంప్రదాయ తరహా పాత్రల్లోనే కనిపిస్తూ వస్తోంది హీరోయిన్ కీర్తి సురేష్. గ్లామర్ పాత్రలకు దూరంగా నటనకు అవకాశం ఉన్న సినిమాలనే ఎంచుకుంటోంది. ఇక, `మహానటి` సినిమా ఆమెను జాతీయ ఉత్తమనటిగా నిలబెట్టింది. దీంతో సినిమాల ఎంపికలో కీర్తి మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.


గ్లామర్‌గా కనిపించాల్సి ఉండే పాత్రలను కీర్తి వెంటనే రిజెక్ట్ చేస్తోందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో కీర్తి స్పందించింది. `నన్ను ప్రేక్షకులు కేవలం ఓ సాధారణ హీరోయిన్‌లా కాకుండా ఓ మంచి నటిగా చూస్తున్నారు. అందుకే పాత్రల ఎంపికలో జాగ్రత్తపడుతున్నా. నన్ను బోల్డ్ క్యారెక్టర్స్‌లో చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడరు. వ్యక్తిగతంగా కూడా అలాంటి పాత్రలు చేయడం నాకిష్టం లేద`ని కీర్తి చెప్పింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com