రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’తో మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ కాయబోతున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ జులై నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలుకానుందని తెలుస్తోంది. ముందుగా ఫైట్ మాస్టర్ పీటర్ హేన్స్ కంపోజింగ్ లో భారీ ఫైట్ సీక్వెన్సెస్ సినిమాని స్టార్ట్ చేయనున్నారు. ముందుగా పీటర్ హెయిన్స్ నేతృత్వంలో యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.