ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లు అర్జున్ సినిమా రీమేక్ లో రణ్ వీర్...

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 03, 2020, 04:38 PM



మొన్నటి సంక్రాంతికి వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రం ప్రేక్షకులను ఎంతగా అలరించిందో.. ఎంతటి విజయాన్ని సాధించిందో మనకు తెలుసు. ఈ చిత్రం ద్వారా అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ చేసిన మ్యాజిక్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక సంగీతం పరంగా కూడా చిత్రంలోని ప్రతి పాటా ఆకట్టుకుని, మ్యూజికల్ గా కూడా పెద్ద విజయాన్ని సాధించింది. దీంతో ఈ చిత్రం రీమేక్ హక్కుల కోసం మంచి డిమాండ్ ఏర్పడింది.


ఈ క్రమంలో బాలీవుడ్ నిర్మాత అశ్విన్ వర్ధే ఈ చిత్రం హిందీ రీమేక్ హక్కులను భారీ మొత్తాన్ని ఆఫర్ చేసి సొంతం చేసుకున్నారు. అలాగే ఈ చిత్రం సాధించిన విజయాన్ని తెలుసుకున్న బాలీవుడ్ హీరోలు పలువురు ఈ రీమేక్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆ విధంగా హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్ ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, చిత్ర నిర్మాత అశ్విన్ మాత్రం రణ్ వీర్ సింగ్ తో ఈ చిత్రాన్ని చేయాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం ఈ విషయంలో ఆయన రణ్ వీర్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com