ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విలక్షణ నటుడు.. నటవిరాట్ రావు గోపాలరావు

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 04, 2020, 10:41 AM



నటవిరాట్ గా పేరొందిన రావు గోపాలరావు 1937వ సంవత్సరం జనవరి 14న కాకినాడలో జన్మించారు. విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు ప్రోత్సాహంతో ఆయన సినిమాలపై దృష్టి పెట్టారు. 1966లో భక్తపోతన సినిమా ద్వారా ఆయన తెరంగ్రేటం చేసారు. అల్లు రామలింగయ్యతో కలిసి ఆయన చేసిన సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మెగాస్టార్ చిరంజీవి- రావు గోపాలరావు కాంబినేషన్ తెలుగు సినీ చరిత్రలో ఒక అరుదైన కాంబినేషన్. మనవూరి పాండవులు, ముత్యాలముగ్గు, ఖైదీ, ఛాలెంజ్, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, గోరంతదీపం, గ్యాంగ్ లీడర్, ఘరానామొగుడు, చాణక్య శపథం, అభిలాష, కొండవీటి దొంగ, భక్తకన్నప్ప సినిమాలు ఆయనకు ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టాయి. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు ఆంధ్ర యూనివర్సిటీ కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com