స్టార్ హీరోలతే స్టెప్పులేస్తే హీరోయిన్ల కెరీర్ పీక్స్ లో ఉంటుంది. టాప్ రేసులో ముందుంటారు. కానీ మెగా సినిమాలు చేసిన అనూ ఇమ్మానుయేల్, మాత్రం స్లంపులో పడింది. ఫేడవుట్ స్టేజ్ కు వెళ్లిపోయింది. మరి అను విషయంలో మెగా ఫార్ములా ఎందుకు పనిచేయలేదో తెలుసా.అను ఇమ్మానుయేల్ కెరీర్ బిగినింగ్ లోనే మెగా సినిమాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసిలో ఆడిపాడింది. నా పేరు సూర్యలో అల్లు అర్జున్ తో రొమాన్స్ చేసింది. దీంతో ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ రిజల్ట్ మాత్రం మరోలా వచ్చింది. ఈ హీరోయిన్ ని ఫేడవుట్ కి దగ్గర చేసింది. . ఆమె నటించిన ఆయా సినిమాలు అపజయాల పాలుకావడంతో పెద్దగా ఆఫర్లు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఈ చిన్నది వెబ్ సీరీస్ లలో కూడా నటించాలని నిర్ణయం తీసుకుందట. ప్రస్తుతం అందుకు సంబంధించిన కొన్ని ప్రాజక్టులు చర్చల దశలో వున్నట్టు తెలుస్తోంది.