ప్రముఖ నటుడు విలక్షణ చిత్రాలతో ఆకట్టుకున్న హీరో చియాన్ విక్రమ్.`అపరిచితుడు` చిత్రంతో తనలోని నట విశ్వరూపాన్ని చూపించిన విక్రమ్ గత కొంత కాలంగా తన స్థాయి విజయాల్ని సొంతం చేసుకోలేకపోతున్నారు. విక్రమ్ తన 60వ చిత్రాన్ని 'పేట' ఫేం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చేయనున్నాడు. విశేషం ఏమిటంటే, ఇందులో విక్రం తనయుడు ధృవ్ కూడా నటిస్తాడట. ధృవ్ గతేడాది 'ఆదిత్య వర్మ' (అర్జున్ రెడ్డి తమిళ రీమేక్) చిత్రం ద్వారా తమిళ చిత్ర రంగానికి హీరోగా పరిచయం అయ్యాడు.