ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందుకే కాస్త బ్రేక్ తీసుకున్నా: ప్రియా ప్రకాశ్ వారియర్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 04, 2020, 11:09 AM



హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్...ప్రియా ప్రకాశ్ వారియర్.. ఓవర్ నైట్ స్టార్. కేవలం కన్ను కొట్టి కుర్రకారు గుండెల్ని పిండేసింది ప్రియా ప్రకాశ్. 'ఒరు అదర లవ్' అనే మలయాళ సినిమాలోని 'మాణిక్య మలరయ పూవి' పాటలో ఆమె పలికించిన హావభావాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు ఏకంగా 72 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారంటే ఆమెకున్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.అయితే, ఈ మధ్య ఆమె సోషల్ మీడియాకు దూరమైంది. ఇన్స్టాగ్రామ్ లో డీయాక్టివేట్ అయింది. దీనికి సంబంధించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో, ఆమె మళ్లీ ఇన్స్టాలోకి ఎంట్రీ ఇచ్చింది. పబ్లిసిటీ కోసం తాను సామాజిక మాధ్యమానికి దూరంగా వెళ్లలేదని చెప్పింది. అలాంటి అవసరం తనకు లేదని... మానసిక ప్రశాంతత కోసం కాస్త బ్రేక్ తీసుకున్నానని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com