రాశీఖన్నాపై కురుస్తోన్న ప్రశంసల వర్షం

  Written by : Suryaa Desk Updated: Mon, Feb 12, 2018, 11:32 AM
 

గత కొన్నాళ్లుగా కెరీర్లో సరైన హిట్ లేక హీరోయిన్ రాశీఖన్నా ఇబ్బందిపడిన సంగతి తెలిసిందే.దీంతో టాప్ లీగ్లో ఉన్నా కూడ కెరీర్ పరంగా కూడా ఆమె కొద్దిగా వెనుకబడ్డారు. కానీ ఆ పరాజయాలకు ఫులుస్టాప్ పెడుతూ రాశీ ఈ నెల 10న విడుదలైన ‘తొలిప్రేమ’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకుంది.


అంతేగాక సినిమాలో ఆమె నటనకి కూడా ప్రేక్షకులు ముగ్దులైపోయారు. ‘ఊహలు గుసగుసలాడే’ తర్వాత ఆ స్థాయి పాత్ర, పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలోనే కనబడ్డాయి ఆడియన్సుకు. ఈ సక్సెస్ తో ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఆమె నటన గురించే చర్చించుకుంటున్నారు. ప్రేక్షకులతో పాటు విమర్శకులు, సినీ పెద్దలు సైతం ఆమె నటనకు ఫుల్ మార్కులు వేశారు. ఈ విజయం ఆమె ఫాలోయింగ్ ను పెంచడమేగాకా నటనకు ఆస్కారమున్న పాత్రలను ఆమెకు చేరువయ్యేలా చేస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.
Recent Post