నితిన్ 25వ సినిమా టైటిల్ ను రివీల్ చేసిన పవన్ !

  Written by : Suryaa Desk Updated: Mon, Feb 12, 2018, 12:02 PM
 

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇది నితిన్ కు 25వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి త్రియవిక్రమ్ కథను అందించడంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇకపోతే చిత్రం టైటిల్ ను కొద్దిసేపటి క్రితమే పవన్ తన నిర్మాణ సంస్థ యొక్క అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేశారు.


సినిమాకు రొటీన్ టైటిల్ కాకుండా ‘ఛల్ మోహన్ రంగ’ అనే వెరైటీ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో ‘లై’ ఫేమ్ మేఘా ఆకాష్ హీరోయిన్ గా మరోసారి నితిన్ సరసన మెరవనుంది. పూర్తి స్థాయి రొమాంటిక్ డ్రామాలా ఉండనున్న ఈ సినిమా యొక్క టీజర్ ను ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేసి ఏప్రిల్ 5న చిత్రాన్ని ప్రేక్షకులకు అందించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
Recent Post