మాఫియా క్వీన్‌ సప్నా దీదీ పాత్రా లో దీపికా

  Written by : Suryaa Desk Updated: Mon, Feb 12, 2018, 12:08 PM
 

ముంబయికి చెందిన మాఫియా క్వీన్‌ సప్నా దీదీ జీవితాధారంగా ఓ బయోపిక్‌ రాబోతోంది. 1980ల్లో సప్నా దీదీ ముంబయిని గడగడలాడించింది. సినిమాలో రీల్‌ లైఫ్‌ సప్నా దీదీగా బాలీవుడ్‌ బ్యూటీ దీపిక పదుకొణె నటించనుంది. విశాల్‌ భరద్వాజ్‌ ఈ సినిమాని తెరకెక్కించనున్నారు.


ఈ చిత్రం గురించి దీపికా మీడియాతో మాట్లాడుతూ… నా అదృష్టం, ఆసక్తి కొద్దీ నాకు ఛాలెంజింగ్‌ పాత్రలే వస్తున్నాయి. 13 వశతాబ్ద కాలం నాటి రాణి పద్మిని తర్వాత వందల సంవత్సరాలకు అంతటి ధైర్య సాహసాలు ప్రదర్శించింది దీదీ ఒక్కరే. ఇలాంటి పాత్రకోసం ఎప్పట్నించో ఎదురు చూస్తున్నా. చాలా ఆతృతగా ఉంది. దర్శకుడు ఈ కథ చెప్పగానే ఎగిరి గంతేసినంత పనిచేయాలనిపించింది. ఈ పాత్ర కోసం ఇప్పటికే కసరత్తులు స్టార్ట్ చేశాను” అని చెప్పుకొచ్చింది దీపిక.


 


 
Recent Post