ఈ పాటలో ....పాలక్ లల్వాని అందాలే ప్రధాన ఆకర్షణ

  Written by : Suryaa Desk Updated: Mon, Feb 12, 2018, 12:25 PM
 

తెలుగులోకి కొత్త అమ్మాయిలు తెగ వచ్చేస్తుండడంతో.. ఇప్పటికే హీరోయిన్స్ గా ఉన్నవాళ్లు తమ సత్తా చాటేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. గతంలో అందాల ప్రదర్శన విషయంలో ఆచితూచి వ్యవహరించిన వారు కూడా.. ఇప్పుడు కంచెలు తెంచేసుకుంటున్నారు.

అబ్బాయితో అమ్మాయి మూవీలో నాగశౌర్యతో కలిసి నటించిన భామ పాలక్ లల్వాని. ఆ సినిమాలో అంతగా తనలోని గ్లామర్ యాంగిల్ ను ఈ వయ్యారి బయటకు తీయలేదు. కానీ ఇప్పుడు జువ్వ అంటూ రంజిత్ అనే కుర్రాడి పక్కన నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి 'ఓ కలా' అంటూ సాగే పాటకు ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో తారాజువ్వల్లాంటి పాలక్ లల్వాని అందాలే ప్రధాన ఆకర్షణ అనడంలో ఆశ్చర్యమేమీ లేదు. అంతగా తన ట్యాలెంట్ చూపించేసింది ఈ భామ. 


 


డ్రెసింగ్ నుంచి ఎక్స్ పోజింగ్ వరకూ.. గ్లామర్ తో కుర్రాళ్లను రెచ్చగొట్టేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలను ఈ పిల్ల బాగానే చేసింది. ఎంఎం కీరవాణి మ్యూజిక్ కావడంతో.. జువ్వలో వినిపిస్తున్న సంగీతం కూడా అలరించేందిగానే ఉంది. హీరోతో కెమిస్ట్రీ పండిచేయడానికి కూడా అస్సలు మొహమాటాలు పెట్టుకోలేదు పాలక్ లల్వాని. మొత్తానికి టాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్ గా ఎదగాలంటే ఏం చేయాలనే సీక్రెట్ ను పసిగట్టేసినట్లుగానే ఉంది పాలక్. మరి ఈ అందాలు ఆమెకు బ్రేక్ ఇస్తాయో లేదో చూడాలి.
Recent Post