పాప ఆనందం కోసం అజిత్ ఏం చేశాడు అంటే

  Written by : Suryaa Desk Updated: Mon, Feb 12, 2018, 02:17 PM
 

తమిళనాట అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అజిత్ చాలా నిరాడంబరంగా ఉండే సంగతి తెలిసిందే. తన పేరిట అభిమాన సంఘాలు చేసే హడావిడిని ఇష్టపడని స్టార్ గా ఇతనికి మంచి పేరు ఉంది. సరే అదంతా సినిమాలకు సంబంధించింది. తన వ్యక్తిగత జీవితంలో మాత్రం భార్య శాలిని కుమార్తె అనౌష్క కొడుకు ఆద్విక్ అంటే అతనికి ప్రాణం. వారి కోసం ప్రత్యేకంగా టైం కేటాయించే అజిత్ స్వీట్ మెమరీగా మిగిలిపోయే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోడు. అలాంటి సంఘటనే ఇప్పుడు వీడియో రూపంలో తలా ఫాన్స్ మధ్య వైరల్ గా షేర్ అవుతోంది. తన పదకొండేళ్ళ కూతురు చదువుతున్న స్కూల్ లో స్పోర్ట్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగా అమ్మాయిలతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా పాల్గొనే ఒక ఆసక్తికరమైన ఈవెంట్ ఒకటి ఉంది. దానికి ఫ్యామిలీ సమేతంగా వచ్చిన అజిత్ కూతురితో పాటు తాను అడుగు కదిపాడు.


రేస్ తరహాలో ఉన్న ఆ ఈవెంట్ లో సైకిల్ ట్యూబ్ తో కూతురి చేయి పట్టుకుని లైన్స్ మధ్య గతి తప్పకుండా అజిత్ చేస్తున్న విన్యాసం ఎవరో అక్కడ వీడియో షూట్ చేయటంతో అది కాస్త వైరల్ గా మారి విపరీతంగా షేర్ అవుతోంది. కూతురిమీద ప్రేమతో అజిత్ తాను ఎంత పెద్ద స్టార్ అనేది మరిచిపోయి ఆ పాప ఆనందం కోసం స్వయంగా రేస్ లో పాల్గొనడం చూసి ఫాన్స్ మురిసిపోతున్నారు. ఇది కదా నాన్న ప్రేమంటే అంటూ హెడ్డింగ్ పెట్టి మరీ దీన్ని ప్రచారం చేస్తున్నారు. సాధారణంగా అజిత్ విజయ్ ఫాన్స్ కు ఏదైనా అతిగా చేస్తారనే పేరుంది. అలాంటిది ఇలాంటి మంచి వీడియో దొరికితే ఊరుకుంటారా. అంతే అందరి స్మార్ట్ ఫోన్స్ లోకి ఇది చేరిపోయింది


అజిత్ లాస్ట్ ఇయర్ చేసిన వివేగం తెలుగులో డిజాస్టర్ అయినప్పటికీ తమిళ్ లో వసూళ్ళ పరంగా భారీగానే రాబట్టింది. నాలుగో సారి అదే దర్శకుడు శివతో టీం కట్టిన అజిత్ ఈసారి మాత్రం గట్టి బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అనే నమ్మకంతో ఉన్నాడు. దీపావళికి విడుదల చేసే ప్లాన్ తో షూటింగ్ త్వరలోనే మొదలు పెట్టబోతున్నారు. అక్కడ ఎంత పెద్ద స్టార్ అయినా తెలుగులో మాత్రం అజిత్ బలమైన మార్కెట్ సృష్టించుకోలేకపోయాడు. 
Recent Post