తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ సినిమా చేస్తున్నాడంటే ఇక అభిమానులకు పండగే. ఇక అది ఎప్పుడు థియేటర్ కి వస్తుందా? అంటూ ఎదురుచూస్తూ వుంటారు. అలాంటి అభిమానులు కేవలం తమిళనాడులోనే కాకుండా తెలుగు నాట కూడా రజనీకి వున్నారు.ఇక తాజాగా ఆయన శివ దర్శకత్వంలో 'అన్నాత్తే' (అన్నయ్య) అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఇందులో ఆయన సరసన ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 'అన్నాత్తే' చిత్రం షూటింగును తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే ప్రారంభిస్తారు. అయితే, రజనీకాంత్ అప్పుడే షూటింగులో పాల్గొనరు. దాంతో ఆయన లేని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తోంది.