జులై మొదటివారంలో 'అల్లుడు అదుర్స్' షూటింగ్ మొదలు..

  Written by : Suryaa Desk Updated: Tue, Jun 30, 2020, 06:50 PM

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజా మూవీ 'అల్లుడు అదుర్స్' తిరిగి సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ జులై మొదటివారంలో స్టార్ట్ కానుందని టాక్.దేశంలో కరోనా కాటుకు సెట్స్‌పై ఉన్న ప్రతిఒక్క సినిమా బలైపోయింది. ముందుగా వేసుకున్న షెడ్యూల్స్ అన్నీ తలక్రిందులయ్యాయి. లాక్‌డౌన్ రావడంతో దాదాపు మూడు నెలలుగా కెమెరా స్విచ్చాన్ చేయకపోవడంతో షూటింగ్స్ అన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయి.'అల్లుడు అదుర్స్' చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగును వచ్చే నెల నుంచి హైదరాబాదులో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేసే ఆలోచన చేస్తున్నారు. ఇందులో అనూ ఇమ్మానుయేల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Recent Post