'లూసిఫర్'లో సినిమాలో కుష్బూ..?

  Written by : Suryaa Desk Updated: Tue, Jun 30, 2020, 06:56 PM

ప్రస్తుతం కొరటాల - చిరంజీవి కలయికలో చిరు 152 వ చిత్రాన్ని మ్యాట్నీ మూవీస్ సంస్థ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన మోహన్ లాల్ చిత్రం 'లూసిఫర్' హక్కుల్ని కొనుగోలు చేసాడు చరణ్.ఈ చిత్రాన్ని చిరంజీవితో నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంకో ఏడాదిలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందని అంటున్నారు. అయితే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసే బాధ్యత సాహో డైరెక్టర్ సుజిత్ కు ఇచ్చాడు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కొన్ని మార్పులు కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలో మంజు వార్యర్ పాత్ర కూడా కీలకమైనది. హీరోకి చెల్లి పాత్ర అయిన ఈ పాత్రను తెలుగు వర్షన్ లో సీనియర్ బ్యూటీ కుష్బూ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్త పై చిత్రబృందం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.కాగా కుష్బూ 'లూసిఫర్'లో ని చెల్లి పాత్రకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది. హీరో పై ద్వేషంతో రగిలిపోతూ.. చివరికి హీరో సాయం కోరే ఎమోషనల్ రోల్ లో కుష్బూ పూర్తి న్యాయం చేస్తోంది. పైగా మెగాస్టార్ కి గతంలోనూ కుష్బూ సిస్టర్ గా నటించింది. మెగాస్టార్ చిరంజీవి సుజీత్ టాలెంట్ పై నమ్మకముంచి అతనికి ఈ భారీ సినిమా అవకాశం ఇచ్చారు. మరి ఈ మెగా ఛాన్స్ ను సుజీత్ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.
Recent Post