చైనా యాప్‌ల నిషేధంపై కంగనా ఆశక్తికరమైన వ్యాఖ్యలు ..

  Written by : Suryaa Desk Updated: Tue, Jun 30, 2020, 07:04 PM

టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్స్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో 'టిక్‌టాక్ ఇండియా' 00 ఓ ప్రకటన విడుదల చేసింది. వినియోగదారుల సమాచార భద్రత, గోప్యత విషయంలో భారతీయ చట్టాలకు లోబడి ఉన్నట్లు పేర్కొంది. భారతీయ వినియోగదారులకు సంబంధించిన సమాచారాన్ని విదేశీ ప్రభుత్వాలతో పంచుకోలేదని చెప్పుకొచ్చింది.'ప్రభుత్వం చైనా యాప్‌లను నిషేధించింది. చాలా మంది ప్రజలు వేడుకలు జరుపుకుంటారనుకుంటున్నా. చైనా కమ్యూనిస్ట్‌ దేశమనే విషయం తెలిసిందే. చైనా మన ఆర్థిక వ్యవస్థలో, సమాజంలో ఎలా చొరబడిందో అందరికీ తెలుసు. కరోనాకు ఆజ్యం పోసిన చైనాపై మన వ్యాపారం ఎంతవరకు ఆధారపడి ఉంది. డాటా విషయంలో ఆందోళన ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వారు (చైనీయులు) లఢఖ్‌లో సమస్యను సృష్టిస్తున్నారు. వారికి కేవలం లఢఖ్‌ మాత్రమే కాదు. అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కింతోపాటు అసోం కూడా కావాలి. ఇది ఇంతటితో ఆగేది కాదని' చెప్పుకొచ్చింది కంగనా.
Recent Post