టాలీవుడ్ ప్రముఖుల్లో మొదటగా వైరస్ బారిన పడ్డది బండ్ల గణేష్ అనే విషయం తెల్సిందే. ఆయనకు కొన్ని రోజుల క్రితం వైరస్ పాజిటివ్ రావడంతో యశోదా హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. అక్కడ చికిత్స పొందిన బండ్ల గణేష్ తాజాగా కరోనాను జయించినట్లుగా స్వయంగా ప్రకటించాడు. 14 రోజుల తర్వాత బండ్ల గణేష్ వైరస్ నెగటివ్ వచ్చినట్లుగా పేర్కొన్నాడు. దేవుడికి కృతజ్ఞతలు అంటూ తెలియజేయడంతో పాటు తనకు వైరస్ నెగటివ్ వచ్చిన రిపోర్ట్ ను కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు.వైరస్ ను జయించిన బండ్ల గణేష్ తన కుటుంబ సభ్యులు అంతా కూడా సేఫ్ గా ఉండటంతో రిలాక్స్ అయ్యాడు. టాలీవుడ్ ప్రముఖులు పలువురు వైరస్ తో బాధపడుతున్నారట. చాలా మంది విషయాన్ని బయటకు చెప్పడం లేదనేది టాక్. కొందరు సెలబ్రెటీలు ఇంట్లో ఉండే వైరస్ కు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ప్రాణ భయం లేని కారణంగా చాలా మంది సెలబ్రెటీలు విషయాన్ని గోప్యంగా ఉంచాలని అనుకుంటున్నారట.
బండ్ల గణేష్ విషయం బయటకు వచ్చిన తర్వాత ఆయన గురించి వచ్చిన వార్తల నేపథ్యంలో చాలా మంది తమ విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారట. ఆ మద్య ఒక స్టార్ హీరో ఇంట్లో వైరస్ అని అతడి తల్లిదండ్రులతో పాటు పని వారికి కూడా వచ్చిందని పుకార్లు వినిపించాయి. కాని అసలు విషయం మాత్రం బయటకు రాలేదు.