స్మైలీ.. స్టైలిష్.. శ్రియ

  Written by : Suryaa Desk Updated: Mon, Feb 12, 2018, 03:02 PM
 

తన పెళ్లి గురించి వచ్చిన ఊహాగానాలన్నింటినీ లైట్ తీసుకుంది శ్రియ శరణ్. ఒక విదేశీయుడితో శ్రియకు పెళ్లి నిశ్చయం అయ్యిందని.. త్వరలోనే పెళ్లి అని వచ్చిన వార్తలను ఆమె కొట్టిపడేసింది. ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని శ్రియ స్పష్టం చేస్తోంది. ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికే పదిహేనేళ్లు దాటిపోయినా.. శ్రియకు అవకాశాలు అయితే తగ్గడం లేదని వేరే చెప్పనక్కర్లేదు.ఈ నేపథ్యంలో తన చూపంతా సినిమాల మీదే తప్ప మరో ఉద్దేశాలేవి ఇప్పుడు లేవన్నట్టుగా శ్రియ బిజీబిజీగా గడిపేస్తోంది. తాజాగా ఈ ఢిల్లీ భామ ఒక ఫొటో షూట్లో పాల్గొంది. తనదైన స్టైలిష్, స్మైలీ, సెక్సీ లుక్స్ తో ఈ ఫొటో షూట్ లో అదరగొట్టేసింది.


గతవారంలో శ్రియ తెలుగు సినిమా ‘గాయత్రి’ విడుదల అయ్యింది. అందులో ఈమె నటనకు గానూ ప్రశంసలు దక్కాయి. ఇక తమిళంలో ‘నరగాసురన్’ సినిమా చేస్తోంది. అలాగే మరో తెలుగు సినిమా ‘వీరభోగవసంతరాయలు’ లో మెరవబోతోంది. అలాగే శ్రీదేవి కూతురు బాలీవుడ్ ఎంట్రీ సినిమా ‘తడ్కా’లోనూ ఒక ముఖ్య పాత్రను చేస్తూ బిజీగా ఉంది శ్రియ.

Recent Post