హీరో ఉంటేనే ముద్దు సీన్లు పండుతాయి

  Written by : Suryaa Desk Updated: Mon, Feb 12, 2018, 04:12 PM
 

తెలుగు అమ్మాయి అంజలి ఇటు టాలీవుడ్ తో పాటు, అటు కోలీవుడ్ లో కూడా మంచి నటిగా పేరు తెచ్చుకుంది. నిండైన వస్త్రధారణతో కనిపించే అంజలి... గ్లామర్ పాత్రలకు కూడా సై అంటోంది. అంతేకాదు ముద్దు సీన్లపై బోల్డ్ గా కామెంట్ చేసింది. ఓ మేగజీన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో... 'ముద్దు సీన్ల చిత్రీకరణ సమయంలో ఎలా ఫీల్ అవుతారు?' అనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీనికి సమాధానంగా... ముద్దు సీన్ల షూటింగ్ సమయంలో ఒక్కోసారి సోలోగానే నటించాల్సి ఉంటుందని చెప్పింది. సోలో క్లోజప్స్ కోసం అలా తీస్తుంటారని తెలిపింది. ఆ సమయంలో ఎదురుగా కెమెరా తప్ప మరెవరూ ఉండరని... తనకు అది చాలా కష్టంగా ఉంటుందని చెప్పింది. సోలోగా ముద్దుపెట్టడం తనకు చాలా కష్టమని... ఎదురుగా హీరో ఉంటేనే ముద్దు సీన్లు పండుతాయని తెలిపింది.  
Recent Post