భర్తతో కలసి నటించే అవకాశాన్ని వదులుకున్న ఐశ్వర్య

  Written by : Suryaa Desk Updated: Mon, Feb 12, 2018, 04:15 PM
 

బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యారాయ్ కి డబ్బు పిచ్చి పట్టిందా? ఔననే అంటున్నారు బాలీవుడ్ జనాలు. వివరాల్లోకి వెళ్తే, తన భర్త అభిషేక్ బచ్చన్ తో కలసి నటించే అవకాశం ఇటీవల ఐశ్వర్యకు వచ్చిందట. కథను విన్న వెంటనే ఆ సినిమాలో నటించేందుకు భార్యాభర్తలు ఇద్దరూ ఓకే చెప్పారట. అయితే, కథలో చిన్నపాటి మార్పులు చేయాలంటూ ఐశ్వర్య సూచించిందట. ఐష్ కోరిన విధంగానే సదరు దర్శకుడు కథలో మార్పులు చేసి తీసుకెళ్లాడట. అయితే, ఇప్పుడు ఈ సినిమా చేయలేనని, మరో సినిమా కోసం రూ. 10 కోట్లు తీసుకున్నానని ఐష్ చెప్పిందట. కథ మారిస్తే తన సినిమా చేస్తానని చెప్పారు కదా అని దర్శకుడు అడిగితే... పది కోట్లు ఇస్తుంటే సినిమాను ఎలా వదులుకుంటానని రిప్లై ఇచ్చిందట. ఈ సినిమా పూర్తయిన తర్వాత మీ సినిమా చేస్తానని చెప్పిందట. ఈమె సినిమా పూర్తయిన తర్వాత అభిషేక్ డేట్లు కుదరాలి కదా అంటూ బీటౌన్ జనాలు ఇప్పుడు గుసగుసలు పోతున్నారు. భర్తతో కలసి నటించే అవకాశం లేకలేక వస్తే... డబ్బు కోసం ఆ అవకాశాన్ని వదిలేసుకుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
Recent Post