ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హాట్ ఫోటోలతో దుమ్మురేపుతున్న బిగ్ బాస్ బ్యూటీ

cinema |  Suryaa Desk  | Published : Sun, Jul 05, 2020, 09:41 AM



బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునయన గుర్తుందా. ప్రస్తుతం ఈ భామ హాట్ ఫోటోలతో దుమ్మురేపుతోంది. సముద్రతీరాన రెడ్ శారీతో నడుం అందాలు ఆరబోస్తూ కుర్రకారు గుండెల్లో బాణాలు గుచ్చేస్తోంది. బిగ్ బాస్ 2 సీజన్ లో దీప్తి చేసిన అల్లరిని ఎవరూ మర్చిపోయి వుండరు. ఆమె ఆటిట్యూడ్ అందరినీ మెస్మరైజ్ చేసింది. సోషల్ మీడియాతో స్టార్ గా ఎదిగిన ఈఅమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయేలా, తెలుగుదనం ఉట్టిపడేలా పోస్ట్ చేస్తున్న ఫోటోలు కుర్రాళ్ల గుండెల్లో గంటలు మోగిస్తున్నాయి. హాట్ ఫోటో షూట్లతో ఆమె సోషల్ మీడియా అకౌంట్ అదిరిపోతోంది. వచ్చిన పాపులారిటీని పదికాలాలు పదిలంగా దాచుకోవాలని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తెగ తాపత్రయపడతారు. దీనికి దీప్తి మినహాయింపేం కాదు. నిన్నమొన్నటివరకూ టిక్ టాక్, హలో యాప్ లతో తన ఫాలోవర్స్ ని పెంచుకున్న ఈ చిన్నది అవకాశాల కోసం ఏం చేయడానికైనా సిద్ధం అవుతోంది. మోడ్రన్ డ్రెస్సుల్లోనే కాదు సంప్రదాయానికి చిరునామా అయిన చీరల్లోనూ తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుని కైపెక్కిస్తోంది. రెడ్ శారీలో ఆమె హొయలొలికించిన ఫోటోలు కేక పుట్టిస్తున్నాయి. దబ్ స్మాష్ లు చేస్తూ అందరి దృష్టిలో పడ్డ ఈ భామ బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో ప్రవేశించింది. తన క్రేజ్ పెంచేసుకుంది. హిట్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ ఆమె చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com