ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అబ్బాయ్ సినిమా.. బాబాయ్ బ్యానర్ లో...!

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 06, 2020, 03:08 PM



మెగా హీరో రామ్ చరణ్ నటించే తదుపరి చిత్రానికి పవన్ కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటిస్తున్న చరణ్ ఈ చిత్రం షూటింగును త్వరలో పూర్తిచేయనున్నాడు. అయితే, ఆ తర్వాత ఆయన నటించే చిత్రం ఏదీ ఇంతవరకు ఫైనల్ కాలేదు.


ప్రస్తుతం కొందరు దర్శకులు చెబుతున్న కథలు వింటున్నప్పటికీ, ఇంకా ఆయనకు ఏదీ నచ్చలేదట. ఇదే సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా ఈమధ్య చరణ్ భేటీ అయ్యాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి కలయికలో ఓ చిత్రం రానుందని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.


ప్రస్తుతం త్రివిక్రమ్ తన తాజా చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేయనున్నారు. ఇది పూర్తయ్యాక చరణ్ తో చేసే ప్రాజక్టుపై కూర్చుంటారని తెలుస్తోంది. ఇక ఈ క్రేజీ ప్రాజక్టును చరణ్ బాబాయ్ పవన్ కల్యాణ్ నిర్మించడానికి సిద్ధంగా వున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కావచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com