సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఇప్పటికే సినిమాకు సంబంధించి కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ లుక్ ను రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తక్కువ టైంలోనే సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక సినిమా స్కాం లు బ్యాంకు మోసాలు నేపథ్యంలో సాగనుంది. మరోవైపు మహేష్ సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ నేపథ్యంలోనే కీర్తి పాత్ర ఎలా ఉండబోతుందని నెటిజన్లు చర్చించుకుంటున్న వేళ ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తుందట. కథలో కీర్తిది కీలక పాత్ర అని అక్కడే హీరోతో ప్రేమలో పడుతుందని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ లకు పర్మిషన్ వచ్చినప్పటికీ కరోనా వ్యాప్తి దృష్ట్యా షూటింగ్ లు జరగట్లేదు. కరోనా వ్యాప్తి తగ్గిన తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.