ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాలీవుడ్ లో పవర్ స్టార్ ఇష్టం: ప్రణీత

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 06, 2020, 04:18 PM



ప్రణీత… హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు లేకపోయినా, రెమ్యునరేషన్ తక్కువగా ఉన్నప్పటికీ కరోనా కష్టకాలంలో ఎంతో మంది పేద వారి ఆకలి తీర్చింది. స్టార్ హీరోయిన్ సైతం చెయ్యని పని చేస్తూ అందరి మన్ననలు పొందింది. ఇక ఇటీవల ట్విట్టర్ లో అడుగుపెట్టిన ప్రణీత అభిమానులతో చాట్ చేసింది. అందులో ఓ అభిమాని అజిత్ గురించి చెప్పండి అంటూ ప్రశ్న వేశాడు. దానికి సమాధానంగా ప్రణీత నాకు తమిళ్ రాదు. కానీ అజిత్ ప్రతి సినిమా చూస్తుంటాను అని చెప్పుకొచ్చింది. మరో అభిమాని టాలీవుడ్, బాలీవుడ్ లో ఇష్టమైన హీరో ఎవరని ప్రశ్నించాడు.దానికి సమాధానంగా బాలీవుడ్ లో అజయ్ దేవగన్ అంటే ఇష్టం. ఇక టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా మహేష్ బాబు అందగాడని, ప్రభాస్ సూపర్ స్టార్, ఎన్టీఆర్ రాక్ స్టార్ అంటూ చెప్పుకొచ్చింది. ప్రణీత ఇచ్చిన ఆన్సర్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com