అబ్బో నాని భామకి ధైర్యం ఎక్కువే

  Written by : Suryaa Desk Updated: Mon, Feb 12, 2018, 04:45 PM
 

హైదరాబాద్: జెంటిల్‌మెన్, నిన్ను కోరి, జైలవకుశ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌ను ఖాతాలో వేసుకుంది టాలీవుడ్ బ్యూటీ నివేదా థామస్. ఈ హీరోయిన్ పైతాన్‌ను మెడలో వేసుకున్న ఫొటోలు ఇపుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అవును మీరు విన్నది నిజమే..ఏ మాత్రం భయం లేకుండా కొండచిలువను తన మెడలో వేసుకుని సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను నివేదా థామస్ ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. సంతోషాన్నిచ్చే పని. కానీ అంత సులభమైంది కాదు అని క్యాప్షన్ పెట్టింది నివేదా. ఇక నివేదా ఫొటోలను చూసిన ఫ్యాన్స్ నువ్వు చాలా గ్రేట్..సూపర్బ్. నీకు ఇది ఎలా సాధ్యమైంది? అంటూ తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు. 


 
Recent Post