దిల్ రాజు రాజు పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. తెలుగు ఇండస్ట్రీలో హీరోలతో సమానమైన ఇమేజ్ ఆయన సొంతం. ఫ్యామిలీ, యువతకు నచ్చే సినిమాలు నిర్మించడం.. వారికి వినూత్న పబ్లిసిటీ కల్పించడంతో దిల్ రాజు ప్రేక్షకుల్లో పాపులర్ అయ్యారు. కరోనా కాలంలో రెండో పెళ్లి చేసుకున్న ఈ అగ్ర నిర్మాతకు సంబంధించిన వార్తలు ఇటీవల వైరల్ గా మారుతున్నారు.పెళ్లి అనంతరం తన ఫిజిక్ పై దృష్టి సారించిన రాజు అందుకోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఆయన కొత్త లుక్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్స్ కూడా ఏం లేకపోవడంతో పూర్తిగా ఫిట్ నెస్పైనే ఆయన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా తన భార్యతో కలిసి బ్యాడ్మింటన్ సెషన్ తర్వాత దిగిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 50 ఏళ్ల దిల్ రాజు 30 ఏళ్లలా కనిపిస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. హీరోగా ఏమైనా చేస్తున్నారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.