ప్రియా ప్రకాశ్ వారియర్ ఎక్స్‌ప్రెషన్స్‌కు నెటిజన్లు ఫిదా

  Written by : Suryaa Desk Updated: Mon, Feb 12, 2018, 04:55 PM
 

ప్ర‌స్తుతం వాట్సాప్‌, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్య‌మాల్లో ఓ వీడియో వైర‌ల్‌గా మారింది. ఆ వీడియోలో న‌టించిన అమ్మాయి తెగ న‌చ్చేసింది. ఆ వీడియోలో ఆ అమ్మాయి హావభావాల‌కు, క‌నుసైగ‌లకు చాలామంది ఫిదా అయిపోతున్నారు. కొంత‌మంది ఆ అమ్మాయి ఫోటోనే త‌మ డీపీగా కూడా పెట్టుకుంటున్నారు. వాలంటైన్స్ డే సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న ఆ వీడియోలో న‌టించిన అమ్మాయి పేరు ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌. ఈ వీడియోను ఒక్క రోజులోనే 40 ల‌క్ష‌ల మంది చూశారు.


 


మ‌ల‌యాళంలో `ఓరు ఆద‌ర్ ల‌వ్‌` పేరుతో తెర‌కెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌. ఈ సినిమాలోని మాణిక్య మలరాయ పూవీ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. ఈ సాంగ్‌లో ప్రియా ప్రకాశ్ వారియర్ ఎక్స్‌ప్రెషన్స్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. యూట్యూబ్ ట్రెండింగ్‌లో ఈ సాంగ్ ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది. మార్చి మూడో తేదీన ఈ సినిమా విడుద‌ల కాబోతోంది. ఈ వీడియోనే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా ట్రెండ్ అవుతోంది. అందులో న‌టించిన ప్రియ తొలి సినిమా కూడా విడుద‌ల కాక‌ముందే సోష‌ల్ మీడియా స్టార్ అయిపోయింది.

 


 
Recent Post