ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రముఖ టీవీ నటుడు ఆత్మహత్య

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 08, 2020, 07:54 PM



సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ కన్నడ టీవీ నటుడు సుశీల్ గౌడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన స్వస్థలం కర్ణాటకలోని మాండ్యలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతపుర అనే రొమాంటిక్ సీరియల్ లో నటించి సుశీల్ మంచి పేరు సంపాదించుకున్నాడు. కన్నడ చిత్రాల్లో నటించేందుకు ఇటీవలే ప్రయత్నాలు కూడా ప్రారంభించాడు. . హీరో దునియా విజయ్‌ నటిస్తున్న తాజా చిత్రంలో సుశీల్‌ పోలీసు పాత్రలో నటించారు. అయితే ఆ చిత్రం విడుదలకు ముందే ఆత్మహత్యకు పాల్పడి అందరినీ షాక్‌కు గురిచేశారు. సుశీల్ ఫిట్ నెస్ ట్రైనర్ గా కూడా ఉన్నారు. ఇటీవల బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడు మరో నటుడు ఆత్మహత్యకు పాల్పడడంతో సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com