మిల్కీ బ్యూటీ తమన్నా.. తొలిసారి ఆ పనిచేయబోతుంది. దీంతో ఆమె అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.తెలుగుతో పాటు హిందీ, తమిళం భాషల్లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. వివరాల్లోకి వెళితే.'మనకున్న మార్కెట్టును బట్టే మనకి పారితోషికం లభిస్తుంది' అంటోంది కథానాయిక తమన్నా. ఇటీవల తాను అడిగినంత ఇవ్వకపోవడంతో ఓ చిత్రంలో నటించడానికి తమన్నా నిరాకరించిందంటూ వార్తలొచ్చాయి. దీనిపై ఆమె స్పందిస్తూ, 'మనం అడిగినంతా ఎవ్వరూ ఇవ్వరు. మనకు ఎంత మార్కెట్ వుందో అంతే ఇస్తారు. అలాంటప్పుడు నేనెందుకు ఎక్కువ అడుగుతాను? ఇవన్నీ అర్థం పర్థం లేని పుకార్లు' అంటూ కొట్టిపారేసింది.