ప్రముఖ సీనియర్ నటి జయంతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొంత కాలం నుండి అనారోగ్య సమస్యలతో భాదపడుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడంతో ఆమెను మంగళవారం బెంగుళూర్ లోని ప్రవేటు ఆస్పత్రిలో చేర్చారు. 35 ఏళ్లుగా ఆమె ఆస్తమాతో బాధపడుతున్నారు. ప్రస్తుతం జయంతికి వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆమెకు కరోనా టెస్ట్ చేయగా ఫలితం నెగిటివ్ గా వచ్చింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎవరూ ఆమెను చూసేందుకు ఆస్పత్రికి రావద్దని కుటుంబ సభ్యులు తెలిపారు. జయంతి ఇప్పటివరకు తెలుగు, కన్నడ భాషల్లో 500 సినిమాలలో నటించారు.