నటి మాళవిక శర్మకి సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఏ పోస్ట్ పెట్టినా అలా క్షణాలలో అభిమానులు ఆ పోస్ట్ వైరల్ చేసేస్తారు. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ భామ వ్యక్తిగతంగా లాయర్ అవ్వాలని అనుకుందట. అందుకే ఎల్.ఎల్.బి కూడా చదివింది. ఈ భామ ఖాళీ దొరికితే ఫోటోషూట్లతో ఇంస్టాగ్రామ్ హీటెక్కిస్తోంది. కానీ అమ్మడి ఫిగర్ చూస్తే ఎలాంటి వారైనా దాసోహం అయిపోవాల్సిందే. అలా ఫోటోలలో అందాలు ప్రదర్శిస్తుంది. తాజాగా వైట్ షర్ట్ వేసుకొని కుర్చీలో కూర్చొని పెట్టిన పోజు చూస్తే ఖచ్చితంగా మాళవిక డేర్ నెస్ తెలిసిపోతుంది. ఆమె కళ్ళతో నవ్వుతూ కుర్ర గుండెలను బంధీ చేస్తోంది. ఇక ఈ భామ అందాలకు ఫిదా అయిపోయి ఇస్మార్ట్ శంకర్ రామ్ కూడా తన ‘రెడ్’ సినిమాలో అవకాశం ఇచ్చాడు. అందులో అమ్మడి అందాలకు మంచి మార్కులే పడుతున్నాయి.