దక్షిణాది బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్. `జెర్సీ`, `కృష్ణ అండ్ హిజ్ లీల` సినిమాలతో తెలుగు వారికి పరిచయమైన శ్రద్ధ తాజాగా తన హాట్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మునుపెన్నడూ లేని రీతిలో హాట్ అవతార్‌లో శ్రద్ధ దర్శనమిచ్చింది. వెండితెరపై కూడా గ్లామరస్ పాత్రల్లో కనిపించేందుకు శ్రద్ధ ఆసక్తిగా ఉందట. `జెర్సీ`లో మధ్య తరగతి మహిళ పాత్రలో మెప్పించిన శ్రద్ధ.. ఇటీవల విడుదలైన `కృష్ణ అండ్ హిజ్ లీల` సినిమాలో ఈ తరం యువతిగా కనిపించి ఆకట్టుకుంది. ఇక, సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష గురించి తాజాగా సోషల్ మీడియా ద్వారా స్పందించింది. పెళ్లి చేసుకున్న హీరోయిన్లకు ఎందుకు అవకాశాలు ఇవ్వరని ప్రశ్నించింది.