దేశంలో కరోనా మహమ్మారి విజ్రంభన కొనసాగుతూనే వుంది. రోజురోజుకి కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. సామాన్య ప్రజల దగ్గర నుంచి ప్రముఖుల వరకు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా బెంగాలీ నటి కోయల్ మల్లిక్ కరోనా భారిన పడ్డారు. కోయల్ మల్లిక్ తో పాటు కుటుంబ సభ్యులందరికీ కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. కోయల్ తండ్రి ప్రముఖ బెంగాలీ నటుడు రంజిత్ మల్లిక్, తల్లి దీపా మల్లిక్, భర్త, నిర్మాత నిస్పాల్ సింగ్ సహా కుటుంబం మొత్తం కరోనా బారినపడినట్లు స్వయంగా నటి కోయల్ మల్లిక్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.