రామలక్షి.. ఎంత సక్కగున్నావే..

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 08:50 AM
 

టాలీవుడ్ లో ప్రస్తుతం ఎంతో ప్రయోగాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా ఏది అంటే.. ఎవ్వరైనా సరే రంగస్థలం అనేస్తున్నారు. లేటెస్ట్ జనరేషన్ స్టార్స్ చేస్తోన్న ఈ ప్రయోగంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో సోషల్ మీడియాలో ఓ లుక్కిస్తే తెలుస్తుంది. రామ్ చరణ్ లుక్కు కొత్తగా ఉండడం అలాగే హీరోయిన్ సమంత గెటప్ మరి కొత్తగా ఉండడంతో  ప్రమోషన్స్ కి బూస్ట్ బాగానే ఇస్తున్నాయి. 


ఇక దర్శకత్వ ప్రతిభ ఎలా ఉంటుందా అనేది టీజర్ లోనే సుకుమార్ ఒక ఉదాహరణ ఇచ్చేశాడు. తప్పకుండా అందరిని ఆకట్టుకుంటుండానికే గట్టి నమ్మకంతో ఉన్నాడు. అయితే మిగతా సంగతులన్నీ పక్కన పెడితే.. అతి ముఖ్యమైన ఘట్టం మ్యూజిక్. అది కరెక్ట్ గా పడితేనే ఆడియెన్స్ కి మరో ఊపు వస్తుంది. అయితే లవర్స్ డే అనగానే అందరి హార్ట్స్ మంచి మూడ్ లో ఉంటాయి కాబట్టి అందుకు తగ్గ పాటని దేవి శ్రీ ప్రసాద్ రెడీ చేయబోతున్నాడు. 


సుకుమార్ టెస్ట్ కి తగ్గట్టుగా ఆ సాంగ్ ఉంటుందట. ఎంత సక్కగున్నావే.. అనే పాటను ఫిబ్రవరి 13న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది. దాదాపు పాటలు అన్ని సెట్ అయినట్లు తెలుస్తోంది. ఇక వచ్చే నెలలో మొత్తంగా రంగస్థలం పాటలు మారు మ్రోగేలా దేవి శ్రీ ట్యూన్ సెట్ చేసినట్లు తెలుస్తోంది.  
Recent Post